రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపం :రాహుల్ గాంధీ

రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపం :రాహుల్ గాంధీ

బుధవారం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా పలువురు ప్రముఖులు ట్వీట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేసారు. రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. "మర్యాద పురుషోత్తముడైన రాముడు ఉత్తమ మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.  అతను మన మనస్సు లోతుల్లో ఉన్న మానవత్వానికి ప్రతీక.. ప్రేమను చాటే రాముడు ఎన్నడూ ద్వేషాన్ని వ్యక్తపరచరు. కరుణామయుడైన రాముడిలో ఎప్పుడూ క్రూరత్వం కనిపించదు. న్యాయానికి ప్రతిరూపమైన రాముడు ఎన్నడూ అన్యాయం వ్యక్తీకరించరు" అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే రాహుల్ బీజేపీ ని మాత్రం తన ట్వీట్ లో ప్రస్తావించలేదు. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు సైతం అయోధ్య మందిర నిర్మాణంపై ట్వీట్ లు చేసారు.