మళ్లీ కన్నుగీటిన రాహుల్..

మళ్లీ కన్నుగీటిన రాహుల్..

ఇప్పటికే ఓసారి పార్లమెంట్‌లో కన్నుగీటి విమర్శలు ఎదుర్కొన్న ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి లోక్‌సభలో కన్నుగీటారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీని కౌగిలించుకున్న తర్వాత ఆయన సీట్లు కూర్చిన కన్ను కొట్టడంపై విమర్శలు రాగా... ఈ సారి సంచలనం సృష్టిస్తున్న రాఫెల్ డీల్‌పై చర్చ సందర్భంలో కన్నుగీటారు. ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందిస్తూ పార్లమెంట్‌లో బల్లలను చర్చిన రాహుల్ గాంధీ.. అలా పక్కకు తిరిగి కన్నుగీటారు. సినీ నటి ప్రియావారియర్ తరహాలో కన్నుగొట్టారంటూ అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న రాహుల్... మరోసారి కన్నుగీటుతూ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. మరోవైపు రాహుల్‌ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాఫెల్ డీల్‌పై సీరియస్‌గా చర్చ సాగుతోన్న వేళ ఈ చేష్టలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.