రాజ్‌కుమార్‌కు ‌రాహుల్ నివాళి

రాజ్‌కుమార్‌కు ‌రాహుల్ నివాళి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేస్తుండగా.. భవిష్యత్‌ ప్రధానిగా చెప్పుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా అదే స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈ ప్రచారంలో భాగంగా బెంగుళూరు వచ్చిన రాహుల్.. సడన్ గా కన్నడ కంటీర్వ రాజ్‌కుమార్‌ సమాధి వద్దకు వెళ్లి పూలు జల్లి నివాళి అర్పించారు. అయితే మూడు రోజుల కిందట ఎయిర్‌పోర్ట్ లో‌ ప్రధాని మోదీని‌ కలసి తన తండ్రి రాజ్ కుమార్ పుస్తాకాన్ని మోదీకి గిఫ్ట్ ఇచ్చారు పునీత్ రాజ్‌కుమార్. ఇక రాహుల్ గాంధీ ఈ రోజు రాజకుమార్ కి‌ నివాళి ఘటించడంతో.. ఎవరికి మద్దతివ్వాలన్న ఆలోచనలో పడ్డారు రాజ్ కుమార్ అభిమానులు.