నాగ్ కంటే ముందు సుమంత్ తోనే..!!

నాగ్ కంటే ముందు సుమంత్ తోనే..!!

చిలసౌ సినిమా మంచి విజయం సాధించింది.  గూఢచారి మాస్ హిట్ కావడంతో.. చిలసౌకు వసూళ్లు తక్కువగా ఉన్నాయి.  మంచి కథ, కథనాలు ఉండటంతో ఈ సినిమాకు ప్రముఖుల దగ్గరి నుంచి స్పందన వచ్చింది.  ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య, సుమంత్ వంటి హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాహుల్ కు వచ్చింది.  

రాహుల్ ఇప్పటికే ఓ కథను నాగ్ చెప్పాడు.  కథ నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట.  రాహుల్ అండ్ కో ఆ పనిలో ఉన్నాడు.  రెండు మూడు నెలల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది.  రాహుల్ దర్శకత్వంలో సుమంత్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నది.  నాగార్జున, నాగ చైతన్యల కంటే ముందు సుమంత్ తో సినిమా చేయబోతున్నాడట.  ఈ సినిమా కనుక విజయం సాధిస్తే.. అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తాయి.