15 మంది స్నేహితుల కోసమే మోడీ ప్రభుత్వం

 15 మంది స్నేహితుల కోసమే మోడీ ప్రభుత్వం

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ ఇలా తన 15 మంది స్నేహితుల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శుక్రవారం కృష్ణగిరిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. 'గత ఐదేళ్లుగా మోడీ 15 మంది కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారు అనిల్‌ అంబానీ, మెహుల్‌ ఛోక్సీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా తదితరులు. వీరంతా మోడీకి స్నేహితులు. వీరంతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దేశం విడిచి పారిపోయారు. ధనవంతులు రుణాలు ఎగ్గొట్టినా జైల్లో వేయట్లేదు. కానీ రైతులను మాత్రం జైళ్లలో పెడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏ రైతుకు జైలు శిక్ష పడదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు.