గాంధీ విగ్రహం ఎదుట సోనియా, రాహుల్‌ నిరసన

గాంధీ విగ్రహం ఎదుట సోనియా, రాహుల్‌ నిరసన

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ఇవాళ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కర్ణాటక, గోవాల్లో బీజేపీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. వీరితోపాటు టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం ఎంపీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు.. కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారాన్ని ఇవాళే తేల్చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.