అమరావతికి రాహుల్‌!

అమరావతికి రాహుల్‌!

దేశంలోని విపక్షాలను ఏకతాటిపై తెచ్చే ప్రక్రియ ఈనెల 22తో ఓ కొలిక్కి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మమతా బెనర్జీతో టచ్‌లో ఉన్నానని,  మాయావతితో ఇదివరకే మాట్లాడానని చెప్పిన చంద్రబాబు.. ఢిల్లీలో జరిగే భేటీలో పలు కలక నిర్ణయాలు తీసుకోనున్నారు. విపక్షాల కూటమికి ఓ పేరు పెట్టడంతోపాటు కార్యాచరణకు తుది రూపు ఇవ్వనున్నారు. విపక్షాలతో కలిసి పెట్టే తొలిసభను అమరావతి ఏర్పాటులో చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతోపాటు ఇతర నేతలను ఆహ్వానించనున్నారు. మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌, కుమారస్వామి, ఫరూక్‌ అబ్దుల్లా, స్టాలిన్‌తో పాటు అరవింద్‌ కేజ్రివాల్‌ను ఆహ్వానించనున్నారు. అఖిలేష్‌తో మాయావతి వేదిక పంచుకుంటారా అన్న అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్‌ సాధిస్తే... అమరావతి సభకు దేశ వ్యాప్తంగా మరింత క్రేజ్‌ ఏర్పడుతుందని తెలుగేదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ముందే డిసెంబర్‌ సభ తేదీ ఖరారు అవుతుందని, అయితే సభ మాత్రం ఎన్నికల తరవాత ఉండే అవకాశముందని భావిస్తున్నారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున... నేతలందరూ బిజీగా ఉంటారని.. కాబట్టి ఎన్నికల తరవాతే సభ ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమికి తొలి శంఖారావం అమరావతి నుంచే వినిపించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత ఇదే అదిపెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందని... 22 తేదీన జరిగే సభ తరవాత అమరాతి సభ ఏర్పాట్లు ప్రారంభమౌతాయని పార్టీ నేతలు అంటున్నారు.