రాయపాటి కంపెనీపై కొనసాగుతున్న దాడులు..

రాయపాటి కంపెనీపై కొనసాగుతున్న దాడులు..

నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన  ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కార్యాలయాలపై  సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయంపై  దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టారని పేర్కొంటూ దాడులకు దిగారు. రాయపాటికి చెందిన ఈ కంపెనీకే 2012లో  పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగిన మాట వాస్తవమేనని రాయపాటి చెప్పారు.  ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షచర్య సాధింపేనని అన్నారు. పోలవరం పనులకు అడ్డంకులు సృష్టించేందుకు ఈ దాడులు చేస్తున్నారని అన్నారు.