రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే ప్రయాణికులకు  ఈ సౌకర్యాన్ని రద్దు చేసింది. డిజిటల్ లావాదేవీలకు  ప్రోత్సహంచే పనిలో భాగంగా ఉచిత బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని రైల్వేశాఖ అంటుంది. ఇన్సూరెన్స్ అనేది ఇకపై ఆప్షన్ గా మాత్రమే ఉండనుంది. 

రైల్వే ప్రయాణికులు వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్  చేసుకుంటే ఇన్సూరెన్స్‌ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు రైల్వే శాఖ తెలిపింది. గత సంవత్సరం ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే శాఖ ఉచిత బీమాను అమలు చేస్తున్నారు. రైలు ప్రమాదాల్లో గాయపడిన, మృతి చెందినవారి కుటుంబసభ్యులకు పరిహారం అందిస్తారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తి మరణిస్తే గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే  రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు  రూ. 10వేలు కూడా అందిస్తుంది.