ఆన్‌లైన్‌లోనే రైల్వే పరీక్ష

ఆన్‌లైన్‌లోనే రైల్వే పరీక్ష

రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని రైల్వేశాఖ ప్రకటించింది. లోకో పైలట్లు, టెక్నీషియన్లకు సంబంధించి 26,502 ఖాళీల భర్తీలకు ఆగస్టు 9న పరీక్ష నిర్వహించనున్నామని పేర్కొంది. ఈ పరీక్షను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తామని తెలిపింది. అయితే అభ్యర్థుల అవగాహన కోసం ఈనెల 26న ఆన్‌లైన్‌లో మాక్‌టెస్ట్‌ నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని  సూచించింది. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.