తెలంగాణకు వర్షసూచన...రేపు,ఎల్లుండి..!

తెలంగాణకు వర్షసూచన...రేపు,ఎల్లుండి..!

తెలంగాణాలో ఈ రోజు  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అక్కడక్కడ  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైఋతి మధ్య ప్రదేశ్ మరియు దానిని ఆనుకొని ఉన్న గుజరాత్ ప్రాంతాలలో అల్పపీడనం బలహీనపడిందని వివరించారు. దానికి అనుబంధంగా కచ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. కచ్ మరియు దాని పరిసర ప్రాంతాల  నుండి గాంగేటిక్ పశ్చిమ బెంగాల్  వరకు మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్ మరియు ఝార్ఖండ్ మీదుగా 2.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.