తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.!

తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.!

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో సైతం నీటి మట్టం పెరిగిపోయింది. దాంతో గేట్లను ఎత్తివేయతున్నారు. ఇక ఈరోజు సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్,మంచిర్యాల, కొమురంభీమ్,ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, జగిత్యాల, మహబూబ్నగర్, నిజామాబాద్,సిద్దిపేట, జనగామ, వరంగల్ జిల్లాల్లో వర్షల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.