భాగ్యనగరంలో భారీ వర్షం..

భాగ్యనగరంలో భారీ వర్షం..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, మధురానగర్‌, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.