ఇండియా vs సౌత్ ఆఫ్రికా : రేపు ఫైనల్ మ్యాచ్‌ కి వరుణుడి ముప్పు!

ఇండియా vs సౌత్ ఆఫ్రికా : రేపు ఫైనల్ మ్యాచ్‌ కి వరుణుడి ముప్పు!

బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్‌ రేపు ఆఖరి మ్యాచ్‌లో తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణమైపోది. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం  టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఎలా అయిన ఇండియన్ టీమ్ ను ప్రతిఘటించి  పరువు నిలబెట్టుకోవాలని డికాక్‌ సేన భావిస్తోంది.

ఇక వరుణుడు ఆఖరి మ్యాచ్‌లోనూ తన ప్రతాపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రేపు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో ఉరుములతో  కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. మ్యాచ్‌ జరిగే సమయంలో 30 నుంచి 40 శాతం వర్షం పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.