ప్చ్‌.. సెమీస్‌ను అడ్డుకున్న వర్షం..!

ప్చ్‌.. సెమీస్‌ను అడ్డుకున్న వర్షం..!

మాంచెస్టర్‌ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ మొదటి సెమీఫైనల్స్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 47వ ఓవర్ తొలి బంతి పడిన తర్వాత చినుకులు ప్రారంభం కావడంతో ప్లేయర్లు మైదానాన్ని విడిచి వెళ్లారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి మధ్యమధ్యలో చిరుజల్లులు పడినా ఆటకు ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ స్కోరు 211/5. రాస్‌ టేలర్‌ (85 బంతుల్లో 67; 3x4, 1x6), టామ్‌ లాథమ్‌ (3; 4 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం తగ్గిన తర్వాత పూర్తిస్థాయి ఓవర్లు ఆడే పరిస్థితి లేకపోతే కనీసం 20 ఓవర్లు అయినా ఆడించే వెసులుబాటు ఉంది. 20 ఓవర్లకు కూడా అవకాశం లేకపోతే రిజర్వ్‌ డే అయిన బుధవారం తిరిగి మ్యాచ్‌ జరుగుతుంది.