రోహిత్‌ రికార్డును దాటేసిన రైనా

రోహిత్‌ రికార్డును దాటేసిన రైనా
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో హోమ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్‌ క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్‌తో కలిపి ఇప్పటికవరకు ఐపీఎల్‌ కెరీర్‌లో రైనా.. 174 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉంది. 160 మ్యాచుల్లో రోహిత్‌ శర్మ 173 సిక్సర్లు కొట్టగా.... రైనా 174 సిక్సర్లతో రోహిత్‌ను రికార్డుని బద్దలుగొట్టాడు. ఇక, ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ అగ్రస్థానాన కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో 265 సిక్సర్లు నమోదు చేశాడు. రెండో స్థానంలో రైనా, మూడో స్థానంలో రోహిత్‌శర్మ ఉండగా, 161 సిక్సర్లతో డివీలియర్స్‌, విరాట్‌ కోహ్లీ సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.