మరో 2 రోజులు వానలు..

మరో 2 రోజులు వానలు..

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులపాటు ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి బలహీనంగా మారుతోందన్నారు. ఈ కారణంగా మరో రెండురోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని  తెలిపారు.