నేటి నుంచి వర్షాలు

నేటి నుంచి వర్షాలు

ఎండ వేడికి విలవిల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చల్లని కబురు. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కొన్ని చోట్ల చిరుజల్లులు.. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ కేరళ తీరాన్ని రుతు పవనాలు 15 రోజులు ఆలస్యంగా తాకడంతో ఏపీపై కూడా ఆ ప్రభావం పడింది. 22 లేదా 23వ తేదీల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. ఆ ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో భారీగా గాలులు వీస్తాయని చెప్పారు.