గోదావరికి పెరిగిన నీటి మట్టం

గోదావరికి పెరిగిన నీటి మట్టం

రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ప్రస్తుత నీటి మట్టం 34.5 అడుగులకు చేరింది. వర్షాలు ఇంకా కురుస్తూనే ఉండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో గుమ్మడివల్లి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలకు ముర్రేవాగు, బుగ్గవాగు, కిన్నెరసాని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.