2 రోజులపాటు మోస్తరు వర్షాలు

2 రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు ప్రమాదం ఉందని హెచ్చరించింది.