నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు

మాల్దీవుల నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణాలో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. తేమశాతం పెరుగడంతో.. రాత్రిపూట చలి ఎక్కువైంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు.