ఈ 3 జిల్లాలకూ భారీ వర్ష సూచన

ఈ 3 జిల్లాలకూ భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందన్న అధికారులు.. వీటి ప్రభావంతోనే నిన్న ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయన్నారు.