నటికి వికటించిన ఫేషియల్.. పరారీలో బ్యూటీషియన్

నటికి వికటించిన ఫేషియల్.. పరారీలో బ్యూటీషియన్

తమిళ నటి రైజా విల్సన్‌ 'వెలయ్యిలా పట్టధారి 2' సినిమాలోని ఓ చిన్నపాత్రతో  సినిమా పరిశ్రమకు పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' సినిమాతో హీరోయిన్‌గా మారింది. దీనికిగానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'అలైస్'‌, 'కాదలిక్క యారుమిల్లై', 'హ్యాష్‌ట్యాగ్‌ లవ్‌' అనే సినిమాలు చేస్తోంది. కాగా, ఆమె రీసెంట్‌గా ఫేషియల్‌ కోసమని బ్యూటీషియన్ భైరవి సెంథిల్‌ దగ్గరకు వెళ్లింది. ఆమె ముఖం మరింత మెరిసిపోయేలా చేస్తానని.. డాక్టర్‌ ఏవేవో చర్మ చికిత్సలు చేయడంతో.. ఫైనల్‌గా అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. భంగపాటుకు గురైన ఆ నటి.. ఇప్పుడు ఆ బ్యూటీషియన్ కోసం గాలిస్తోంది. ప్రస్తుతం ఆ బ్యూటీషియన్ పరారీలో ఉంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రైజా విల్సన్‌ సోషల్‌ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసింది.