హారర్ సినిమాకు సై!

హారర్ సినిమాకు సై!
అంజలి హీరోయిన్ గా నటించిన 'గీతాంజలి' చిత్రంతో దర్శకుడిగా మారాడు రాజ్ కిరణ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి సినిమా కూడా హారర్ నేపధ్యంలో సాగాలని 'త్రిపుర' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రిజల్ట్ బెడిసికొట్టడంతో రూట్ మార్చి విష్ణు హీరోగా 'లక్కున్నోడు' సినిమాను రూపొందించాడు. అది కూడా ఈ దర్శకుడికి కలిసి రాలేదు. దీంతో తనకు అచ్చొచ్చిన హారర్ జోనర్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం హీరోయిన్ నందితాశ్వేతాను ఎన్నుకున్నట్లు సమాచారం. 'ఎక్కడకు పోతావు చిన్నవాడా' సినిమాలో నటించిన నందితాకు తెలుగునాట మంచి గుర్తింపే లభించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోన్న నందితా ఈ హారర్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి తన నటనతో ఎంతగా మెప్పిస్తుందో చూడాలి!