అమీర్ పై రాజ్ కుమార్ క్లారిటీ

అమీర్ పై రాజ్ కుమార్ క్లారిటీ

అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బయోపిక్ ల హవా సాగుతోంది.  బాలీవుడ్ లో వరసగా బయోపిక్ లు వస్తున్నాయి.  తాజాగా సంజయ్ దత్ జీవిత చరిత్ర గురించిన బయోపిక్ తయారవుతోంది.  రణబీర్ కపూర్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహిస్తున్నారు.  సంజు ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.  ట్రైలర్ పై భారీ రెస్పాన్స్ వస్తోంది.  

రణబీర్ కపూర్ సంజు పాత్రకు అచ్చుగుద్దినట్టుగా సరిపోయాడని అభిమానులు అంటున్నారు.  ఇక సంజయ్ దత్  తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావెల్ పోషిస్తున్నారు.  అయితే, రాజ్ కుమార్ సునీల్ దత్ పాత్రకోసం అమీర్ ఖాన్ ను సంప్రదించారు.  సునీల్ దత్ పాత్రను అమీర్ ఖాన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.  అమీర్ ఖాన్ ఎందుకు తిరష్కరించాడనే విషయాన్ని హిరానీ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. అమీర్ తనకు మంచి స్నేహితుడని, తనతో ప్రతి స్క్రిప్ట్ ను డిస్కస్ చేస్తానని చెప్పాడు. అలాగే సంజు సినిమా స్క్రిప్ట్ ను కూడా చెప్పాడు. తనకు బాగా నచ్చిందని, అయితే, సునీల్ దత్ పాత్రను చేస్తారా అని అడిగినట్టు హిరానీ చెప్పారు.  ఇది జరిగిన కొన్ని రోజులకు అమీర్ రాజ్ కుమార్ కు ఫోన్ చేసి, దంగల్ లో తండ్రి పాత్రను పోషించానని, మళ్ళి తండ్రి పాత్రను చేస్తే.. అలాంటి క్యారెక్టర్లే పరిమితం చేస్తారు.. కాబట్టి సంజు సినిమా చేయలేనని చెప్పాడట అమీర్.