రాజ్‌తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌.. బయటపడ్డ డీల్

రాజ్‌తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌.. బయటపడ్డ డీల్

హీరో రాజ్‌తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాగిన మత్తులో గోడను ఢీకొట్టినట్లు స్థానికుల ముందు ఒప్పుకున్నాడు రాజ్‌ తరుణ్‌. రోడ్డు ప్రమాదం తర్వాత పారిపోతున్న రాజ్‌తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నారు స్థానికులు. దీంతో తాను మద్యం తాగి ఉన్నానని, విడిచిపెట్టాలని వారిని కోరాడు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కార్తీక్‌ వీడియో తీశాడు. 

విషయం తెలుసుకున్న రాజ్‌తరుణ్ మేనేజర్‌ రాజా రవీంద్ర... వీడియో తీసిన కార్తీక్‌ను బెదిరింపులకు దిగాడు. వీడియో బయట లీక్ చేస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ ఫుటేజీ ఇస్తే 5లక్షలు ఇస్తానంటూ బేరసారాలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఆడియోను బయటపెట్టాడు కార్తీక్.. మరోవైపు కార్తీక్‌కే డబ్బు డిమాండ్ చేసినట్టు రాజా రవీంద్ర ఆరోపించారు. అతనిపై బ్లాక్ మెయిల్ కేసు పెడతానని.. చట్ట ప్రకారం వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజా రవీంద్ర.. బయట పెట్టిన సంచలన విషయాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..