ప్రధాని మోడీకి తప్ప అందరికి ఆహ్వానం

ప్రధాని మోడీకి తప్ప అందరికి ఆహ్వానం

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఇంట్లో శుభకార్యం జరగనుంది. ఈనెల 24న తన కుమారుడు అమిత్ థాకరే వివాహం మిథాలీ బోర్డేతో నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకకు ప్రధాని మోడీ తప్ప, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను రాజ్ థాకరే ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కేంద్ర క్యాబినెట్ మంత్రులు ముంబయి తరలిరానున్నారు. రాజ్ థాకరే గత కొద్ది సంవత్సరాలుగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

జనవరి 27న ముంబయిలోని సెయింట్ రిట్జ్ హోటల్ లో రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే వివాహం డాక్టర్ సంజయ్ బోర్డే కుమార్తే మిథాలీ బోర్డేతో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు హజరుకావాలంటూ పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పెళ్లి వేడుకకు హజరవుతున్న వారిలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, మేనకా గాంధీ, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.