పవర్ ప్లే టీజర్ రిలీజ్..

పవర్ ప్లే టీజర్ రిలీజ్..

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రాజతరుణ్ తాజాగా చేస్తున్న సినిమా టీజర్ వచ్చేసింది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పవర్ ప్లే. ఈ సినిమా రాజ్ తరుణ్, విజయ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఒరేయ్ బుజ్జిగా మంచి హిట్ అందుకుంది. దాంతో వీరు మరో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. అయితే పవర్ ప్లే సినిమాను గతనెల 14న ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైందో లేదో కూడా ప్రేక్షకులకు తెలీదు. అంతలోనే టీజర్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాకుండా విజయ్  ఈ సినిమా కన్నా ముందు కన్నడలో ఓ సినిమాను చేస్తున్నారు. మరి ఆ సినిమా, పవర్ ప్లేను ఒకే సారి చిత్రీకరణ జరిపాడా అన్న సందేహాలు కూడా అభిమానుల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా అత్యంత వేగంగా సినిమాను ముగిస్తూ అప్పుడే టీజర్ విడుదల చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. సినిమాపై ఉన్న అంచనాలను టీజర్ తారాస్థాయికి తీసుకొని వేళ్లింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ఊహలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.