సంక్రాంతి స్పెషల్‌గా రాజ్‌తరుణ్ పవర్ ప్లే

సంక్రాంతి స్పెషల్‌గా రాజ్‌తరుణ్ పవర్ ప్లే

సంక్రాంతి సందర్భంగా అనేక మంది హీరోలు తమ నూతన సినిమాల పోస్టర్లను విడుదల చేస్తున్నారు. నేడు దాదాపు 20పోస్టర్ల వరకు విడుదలయ్యాయి. అయితే వాటిలో యంగ్ హీరో రాజ్‌తరుణ్ కూడా లేటెస్ట్ లుక్స్‌తో తన తదుపరి చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు పవర్ ప్లే అనే క్యాచీ టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్‌ను అగ్ర హీరో రానాదగ్గుపాటి రిలీజ్ చేశారు. అంతేకాకుండా రాజ్‌తరుణ్ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలు రాయి కావాలని కోరుకున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌పై హీరో రాజ్‌ తరుణ్ స్పందించారు. ‘ నా చివరి చిత్రం ఒరేయ్ బుజ్జిగా మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో చేయడం నాకు ఆనందంగా ఉంది. ఈ సారి ఓ థ్రిల్లర్ సినిమా కోసం మేము జతకట్టాము. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుంద’ని చెప్పాడు. ఈ సినిమాను విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరేజ్ బుజ్జిగా సినిమాను కూడా విజయ్ చేశాడు. ఇంతకు ముందు రాజ్ తరుణ్ చేసిన సినిమాలు చెప్పుకోదగ్గ హిట్ అందించ లేక పోయాయి. ఈ సినిమాతోనైనా తరుణ్ కెరీర్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా వారిని ఎంతవరకూ మెప్పింస్తుందో చూడాలి.