లైవ్: పవర్ ప్లే ప్రీ రిలీజ్

లైవ్: పవర్ ప్లే ప్రీ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు.ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాజ్ తరుణ్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత వరుస సినిమాలు చేసినప్పటికీ తరుణ్ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయారు. ఆ తరువాత ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన రాజ్ అదే దర్శకుడితో మరో సినిమాను ఓకే చేవారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ప్రధాన పాత్రగా చేస్తున్న సినిమా పవర్ ప్లే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రాజ్ తరుణ్, విజయ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా. ఈ సినిమాలో కోటా శ్రీనివాస్, ప్రిన్స్, అజయ్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చేస్తున్నారు.