లవర్ సెన్సార్ వివరాలు 

లవర్ సెన్సార్ వివరాలు 

తెలుగు యువహీరో రాజ్ తరుణ్ తాజగా  నటించిన చిత్రం లవర్. దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. ఇది వరకే రిలీజైన పాటలకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని.. విడుదలపై పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇవాళే సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్లగా యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. 

ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన నేపథ్యంలో యువతకు బాగా నచ్చుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తపరుస్తోంది. రాజ్ తరుణ్ సరసన రద్దీ కుమార్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో రిలీజ్ కానుండడంతో మంచి కంటెంట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సమీర్ సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు ఈ సినిమా విజయం కీలకంగా మారింది.