అప్పట్లో రాజబాబు డిమాండ్ ఎలా ఉండేదంటే... 

అప్పట్లో రాజబాబు డిమాండ్ ఎలా ఉండేదంటే... 

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమా రంగంలో కామెడీకి చాలా ప్రాధాన్యత ఉండేది.  సినిమా ఎంత సీరియస్ గా సాగుతున్నా, కామెడీ మాత్రం పక్కాగా ఉండేది.  కామెడీ చేయడం కోసం కొంతమంది నటీనటులు ఉండేవారు.  వారిలో రాజబాబు ఒకరు.  అంతేకాదు, రాజబాబుతో పాటు రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం వంటివాళ్ళు కూడా ఉండేవారు.  వీరందరిలోకి రాజబాబుకే ఎక్కువ పేరు వచ్చింది.  

సినిమా రంగంలో స్థిరపడటం కోసం రాజబాబు చాలా కష్టపడ్డారు.  ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నీళ్లు తాగి రోడ్డుపై పడుకునే రోజుల నుంచి ఆరోజుల్లోనే లక్ష రూపాయల విలువైన కారులో తిరిగేవరకు ఎదిగిన వ్యక్తి రాజబాబు.  ఆయన చేసిన సినిమాలు ఎన్నో అద్భుతాలను సృష్టించాయి.  హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్నారు.  అప్పట్లో ఎన్టీఆర్ కు 35 వేలు పారితోషికం ఇస్తే, రాజబాబుకు కూడా ఇంచుమించుగా అదే విధంగా పారితోషికం అందించేవారట. తక్కువ ఇస్తే అసలు ఒప్పుకునేవారు కాదని అప్పట్లోనే ఓ నానుడి ఉండేది.  ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న ఎందరినో అయన ఆదుకున్నారు.