చరణ్ విషయంలో ఆశ్ఛర్యం గానూ...ఆనందం గానూ ఉంది: రాజమౌళి

చరణ్ విషయంలో ఆశ్ఛర్యం గానూ...ఆనందం గానూ ఉంది: రాజమౌళి

రాంచరణ్,ఎన్టీఆర్ కథానాయకులుగా "ఆర్ఆర్ఆర్" చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి చరణ్ కు ఇదివరకే కెరీర్ బెస్ట్ హిట్ "మగధీర"ను ఇచ్చాడు. అయితే రాజమౌళి చరణ్ నటనను ఇప్పుడు చూసి ఆశ్ఛర్య పోతున్నారట.రాజమౌళి చరణ్ గురించి మాట్లాడుతూ. ..'గతంలో చరణ్ తో 'మగధీర' చేశాను. అప్పుడు నేను చూసిన చరణ్ వేరు .. ఇప్పుడు నేను చూస్తున్న చరణ్ వేరు. 'రంగస్థలం' సినిమా చూసిన తరువాత నటన పరంగా చరణ్ చాలా మెట్లు ఎక్కేశాడనే విషయం నాకు అర్థమైంది. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఆయన నటనను చాలా ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూశాను. నటన పై చరణ్ కు ఉన్న అంకిత భావాన్ని గమనించాను. చరణ్ నటన ఆశ్చర్యంగానూ.. ఆనందంగానూ ఉంది" అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ సినిమాలో వివిధ పరిశ్రమల నుండి ప్రముఖులు నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, అలియా బట్ నటిస్తున్నారు.