ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి ఒక్కరే దర్శకుడు కాదా ?

ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి ఒక్కరే దర్శకుడు కాదా ?

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది.  మరో రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది.  అయితే, ఈ సినిమా మొదట అనుకున్నట్టుగా జులై 30 వ తేదీన కాకుండా వచ్చే ఏడాది జనవరి 8 న రిలీజ్ కాబోతున్నది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వలన సినిమా ఆలస్యం అవుతున్నట్టు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.  దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు.  

ఇందులో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు.  ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి.  అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే, రాజమౌళితో పాటుగా ఈ సినిమాకు సంజయ్ పాటిల్ అనే మరో దర్శకుడు కూడా దర్శకత్వం వహిస్తున్నారట.  సంజయ్ పాటిల్ ఎవరు అనే విషయం గూగుల్ లో సెర్చ్ చేసిన దొరకడం లేదు.  ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక్కరు కాకుండా ఇద్దరు దర్శకులు అనే న్యూస్ బయటకు రావడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.