కేరాఫ్ కంచరపాలెంపై రాజమౌళి ప్రశంసలు

కేరాఫ్ కంచరపాలెంపై రాజమౌళి ప్రశంసలు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపుగా అన్ని హిట్టే.  బాహుబలి తరువాత రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  ఒక ప్రాంతీయ సినిమా రెండువేల కోట్లు వసూలు చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  అప్పుడప్పుడు రాజమౌళి కొన్ని సినిమాల గురించి మాట్లాడుతుంటాడు.  అలా ఏదైనా సినిమా గురించి చెప్పాడు అంటే దాంట్లో కంటెంట్ ఉంటేనే మాట్లాడుతాడు.  

తాజాగా రాజమౌళి కేరాఫ్ కంచరపాలెం ట్రైలర్ గురించి మాట్లాడాడు.  కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని క్యారెక్టర్లు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయని, అవి మనల్ని సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత కూడా పదేపదే గుర్తుకు వస్తాయని, సినిమా కాన్సెప్ట్ బాగుందని అన్నారు. అందరు తప్పకుండా ఈ సినిమా చూడమని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.