త్రివిక్రమ్ ధైర్యాన్ని మెచ్చుకున్న రాజమౌళి !

త్రివిక్రమ్ ధైర్యాన్ని మెచ్చుకున్న రాజమౌళి !

నిన్న విడుదలైన ఎన్టీఆర్ 'అరవింద సమేత' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చాలా బాగా తీశారని అందరూ పొగుడుతున్నారు.  అలా పొగుడుతున్న వారిలో సెలబ్రిటీలు కూడ ఉన్నారు.  స్వయంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ లేకపోతే సినిమా లేదని అన్నాడు. 

ఇప్పుడు సినిమాను వీక్షించిన దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి మాట్లాడుతూ యుద్ధం తరవాత పరిణామాల్ని ప్లేట్ పాయింట్ గా తీసుకుని సినిమాను మొదలుపెట్టడం త్రివిక్రమ్ ధైర్యానికి నిదర్శనం.  ఆ ఫార్ములా బాగా వర్కవుట్ అయింది.  తారక్ పెర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది.  జగపతిబాబుగారి నటన గొప్పగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.