కబడ్డీ టీమ్ మెంటర్ గా రాజమౌళి !

కబడ్డీ టీమ్ మెంటర్ గా రాజమౌళి !

ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ ఆటకు ఆదరణ బాగా పెరిగింది.  అన్ని రంగాల వారు క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కబడ్డీని బాగానే ప్రమోట్ చేశారు.  ముఖ్యంగా మన సినీ తారలు కబడ్డీ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్ ను ప్రెజెంట్ చేస్తున్నారు.  ఈ టీమ్ కు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశారు.  త్వరలోనే ఈ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది.