'ఆర్ఆర్ఆర్' టైటిల్ మీరే నిర్ణయించండి !

'ఆర్ఆర్ఆర్' టైటిల్ మీరే నిర్ణయించండి !

రాజమౌళి మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమాకి 'ఆర్ఆర్ఆర్' అనేది టైటిల్ అని ప్రకటించేశాడు.  సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడం లాంటి ఇతర భాషల్లో కూడా రిలీజవుతుంది.  అన్నిటిలోనూ 'ఆర్ఆర్ఆర్' కామన్.  కానీ ప్రతి భాషలోనూ ఆ భాషకి తగ్గట్టు దాని ఫుల్ ఫామ్ మారుతుంది.  కాబట్టి 'ఆర్ఆర్ఆర్' అనే షాట్ ఫామ్ వచ్చేలా టైటిల్స్ సజెస్ట్ చేయమని ప్రేక్షకుల్ని కోరారు.  ప్రేక్షకులు చెప్పిన పేర్లలో బాగున్న వాటిని సినిమాకి పెడతామని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.  ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు తమ క్రియేటివిటీని ఉపయోగించి టైటిల్స్ సజెస్ట్ చేయండి మరి.