రాజమౌళితో బాలయ్య సినిమా ఎప్పుడంటే...!

రాజమౌళితో బాలయ్య సినిమా ఎప్పుడంటే...!

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది.  షూటింగ్ లు ఆగిపోయాయి.  రిలీజ్ కావాల్సిన సినిమాలు ల్యాబ్ కు పరిమితం అయ్యాయి.  ఎక్కడి గ్లామర్ అక్కడే ఆగిపోయింది.  సినిమా తారలు ఇంట్లో వంటలు చేసుకోవడం, సినిమా కబుర్లు చెప్పుకోవడం, ఫ్యామిలీతో కలిసి మాట్లాడుకోవడం, లేదంటే ఆన్లైన్ ద్వారా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.  

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరూ అంటే ఠక్కున చెప్పే సమాధానం రాజమౌళి అని.  ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.  ఆ తరువాత ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేశారు.  అయితే, సింహాద్రి సినిమా ఎన్టీఆర్ తో కాకుండా మొదట బాలయ్యతో చేయాల్సి ఉన్నది.  కానీ, అప్పటికే బాలయ్య ఈ తరహా సినిమాలు చేయడంతో ఎన్టీఆర్ కు ఆ అవకాశం దక్కింది.  తరువాత బాలయ్యతో సినిమా చేయలేకపోయారు.  చిరంజీవితో కూడా సినిమా చేయాలనీ అనుకున్న కుదరలేదట.  అయితే, ఎప్పటికైనా బాలయ్యతో సినిమా చేస్తానని రాజమౌళి చెప్తున్నాడు.  ఆర్ఆర్ఆర్, మహేష్ బాబు సినిమా తరువాత బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.