ఆర్ఆర్ఆర్ లో ఆ పాత్ర నిడివి పెంచారట...!

ఆర్ఆర్ఆర్ లో ఆ పాత్ర నిడివి పెంచారట...!

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా మొత్తం భారత దేశం ఎదురు చూస్తున సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అజయ్ పాత్రకు సంబంధించి ఓ వార్త  చెక్కర్లు కొడతుంది. అదేంటంటే... ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర నిడివి పెంచారట! ఎందుకంటే ఆయన స్థాయికి ఆ పాత్ర  చాల చిన్నది అని  భావించాడట జక్కన. అంతే కాదు బాలీవుడ్ లో ఆయన అభిమానులను ఆకర్షించడానికి  ఈ పని చేసాడు జక్కన అని తెలుస్తుంది. ఇందులో అజయ్ కు జోడీగా శ్రియా నటించనుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. ఇక ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు.  ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌, చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.