'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణకు బ్రేక్

'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణకు బ్రేక్

దర్శకుడు రాజమౌళి ఎప్పటిలాగే 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్ని కూడా నిదానంగానే చేస్తున్నారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ గతంలో గాయాలై కావడం వలన షూటింగ్ ఆలస్యమైంది.  కొన్నిరోజుల క్రితమే ఇద్దరూ కోలుకోవడంతో షూటింగ్ మొదలైంది.  మళ్ళీ ఇప్పుడు బ్రేక్ పడింది.  అందుకు కారణం రాజమౌళియేనట.  అవును.. ఏదో పర్సనల్ పని మీద జక్కన్న అమెరికా వెళ్లాల్సి ఉండటంతో వారంపాటు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు.  ఇకపోతే దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.