రాజమౌళి ఆ టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నారా? 

రాజమౌళి ఆ టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నారా? 

రాజమౌళి ఆర్ఆర్ ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేశారు.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు సమయం పడుతుంది కాబట్టి ఈ సినిమాను జులై 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 కి రిలీజ్ డేట్ మార్చిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ సినిమాకు సంబంధించి ఈ నెలలో అప్డేట్స్ రాబోతున్నాయి.  

ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు.  ఆర్ఆర్ఆర్ అన్నది వర్కింగ్ టైటిల్ మాత్రమే. సినిమా టైటిల్ విషయంలో రాజమౌళి అనేక ఆలోచనలు చేస్తున్నారు.  అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై రాజమౌళి ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది.  స్వాతంత్ర కాలానికి సంబంధించిన సినిమా కావడంతో దీనికి రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది.  దాదాపుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.