ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి నయా ప్లాన్... ఏం చేయబోతున్నారంటే...!!

ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి నయా ప్లాన్... ఏం చేయబోతున్నారంటే...!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.  మరో రెండు నెలల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారు.  ఈ ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాను వచ్చే ఏడాది జనవరి 8 కి పోస్ట్ ఫోన్ చేశారు.  అంటే సంక్రాంతికి సినిమా రాబోతుందన్నమాట.  

అయితే, సినిమా విషయంలో రాజమౌళి ప్రమోషన్ ను వినూత్నంగా చేయబోతున్నారు.  అదేమంటే, ప్రమోషన్ కోసం కొత్త తరహాలో సాంగ్ క్రియేట్ చేస్తున్నారట.  దీంతో పాటుగా ఓ వీడియో గేమ్ ను కూడా రెడీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  మాములుగా పెద్ద సినిమాల కోసం ఇటీవల కాలంలో ప్రమోషన్ సాంగ్స్ ను చేస్తున్నారు.  రాజమౌళి సినిమా కాబట్టి ఈ ప్రమోషన్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. గేమ్ కూడా ఎలా ఉంటుందో చూడాలి.  రిలీజ్ కు ఇంకా దాదాపుగా ఏడాది సమయం ఉన్నది కాబట్టి రాజమౌళి మరోసారి తన ముద్రను వేసేలా సినిమా తీస్తారని అనుకోవచ్చు.