మహేష్ - ప్రభాస్ లతో రాజమౌళి మల్టీస్టారర్..?

మహేష్ - ప్రభాస్ లతో రాజమౌళి మల్టీస్టారర్..?

దర్శకదీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా  'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంతవరకు అనౌన్స్ చెయ్యలేదు. అయితే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తరువాత మహేష్ బాబు తో సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 

రాజమౌళి మరో మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రభాస్ కలిసి నటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. రాజమౌళి నిజంగా ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ తెరకెక్కిస్తే ఫ్యాన్స్ కు పండగే . మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదనేది చూడాలి.