రాజమౌళి అన్ని విషయాలు చెప్తాడట..!!

రాజమౌళి అన్ని విషయాలు చెప్తాడట..!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నది.  ఇక్కడి షెడ్యూల్ ముగిశాక యూనిట్ కోల్ కతా వెళ్ళాలి.   ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రెస్ మీట్ ను నిర్వహించలేదు.  దీంతో ఆర్ఆర్ఆర్ లో ఏం జరుగుతున్నదనేది పెద్దగా బయటకు రావడం లేదు.  

తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి అండ్ కో కోల్ కతా వెళ్లే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.  ఆర్ఆర్ఆర్ సినిమా గురించిన విషయాలను ప్రెస్ తో పంచుకుంటారని సమాచారం.  ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారు  అనే దానిపై ఇప్పుడు క్యూరియాసిటీ పెరిగింది.