తెగ సంబరపడిపోతున్న రాజమౌళి !

తెగ సంబరపడిపోతున్న రాజమౌళి !

బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'.  ఈ సినిమా తెలుగులో సైతం రిలీజ్ కానుంది.  ఈ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఈరోజు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు. 

ఇలా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయడం గొప్పగా భావిస్తున్నానని, అమీర్ ఖాన్, అమితాబ్ ఇలా ఇద్దర్నీ కలిసి స్క్రీన్ మీద చూడటం ఒక వేడుకలా ఉందని సంబరపడిపోయారు.  ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్ లు కూడ నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.  ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నారు.  ఇకపోతే తమిల్ వెర్షన్ ట్రైలర్ ను కమల్ హాసన్ రిలీజ్ చేశారు.  

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :