చరణ్, ఎన్టీఆర్ చేయబోయే పాత్రలు ఇవే !

చరణ్, ఎన్టీఆర్ చేయబోయే పాత్రలు ఇవే !

రాజమౌళి ఎట్టకేలకు తన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్లాట్ ఏమిటో రివీల్ చేశారు.  సినిమా కథ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా ఉంటుందని రివీల్ చేశారు.  అంతేకాదు యుక్త వయసులో సీతారామరాజుగా చరణ్, యువకుడైన కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తారని తెలిపారు.  చివరగా సినిమా కథను వీరుల జీవితాల ఆధారంగా తీసుకున్నా పూర్తి కథ ఫిక్షన్ అని అన్నారు.  అలాగే సినిమా చిన్న స్థాయిలో ఉండదని, భారీగా ఉంటుందని, అనేక భాషల్లో రూపొందుతుందని తెలిపారు.