రాజమౌళి చెప్పిన మగధీర సీక్రెట్..!!

రాజమౌళి చెప్పిన మగధీర సీక్రెట్..!!

మెగాస్టార్ చిరంజీవి అనగానే డ్యాన్స్ బాగా చేస్తారు.. ఫైట్స్ బాగా చేస్తారు.. డైలాగ్స్ అద్బుతంగా చెప్తారు.. తనకంటూ ఒక స్టైల్ ఉంటుందని చెప్తారు.  ఈ కారణంగానే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోగాలిగారని అంటారు.  ఇది నిజమే.  కాకపోతే, చిరంజీవిలో మరో క్వాలిటీ కూడా ఉంది.  అదే కథను అంచనా వేయడం.  

సినిమా హిట్ అవ్వాలి అంటే.. కథ బాగుండాలి.  కథనాలు అద్బుతంగా ఉండాలి.  దీనికి తగ్గట్టుగా మేకింగ్ ఉండాలి.  అప్పుడే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.  సినిమా హిట్ అవుతుంది.  అన్నింటికంటే ముఖ్యం కథను అంచనా వేయడం.  ఇది తెలియకనే చాలా మంది హీరోలు చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.  

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, మగధీర సినిమా సమయంలో రాజమౌళి చిరంజీవిని కలిసి కథ చెప్పాడట.  రాజమౌళి చెప్పిన కథను చిరంజీవి ఓకే  చేసిన తరువాతనే మగధీర సినిమాను ఎనౌన్స్ చేశాడు రాజమౌళి.  ప్రేక్షకులకు ఎలాంటి కథ నచ్చుతుంటే.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అద్బుతంగా అంచనా వేస్తారని రాజమౌళి ఇటీవల జరిగిన విజేత ఆడియో వేడుకలో పేర్కొన్నాడు.