తూచ్... రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ అది కాదట..!!

తూచ్... రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ అది కాదట..!!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించిన షూటింగ్ వేగంగా జారుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరా పండుగ రోజున ఆర్ఆర్ఆర్ సినిమా గురించిన విషయాలు ఏవైనా బయటకు వస్తాయని అనుకున్నారు.  కానీ, అధికారికంగా ఎలాంటి వార్తలు వెలువడలేదు.  అయితే, సడెన్ గా ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ ను ఇదే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.  

మాములుగా టైటిల్ ను ఎవరో పెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు.  సినిమా పిఆర్ అకౌంట్స్ నుంచి సినిమా టైటిల్ రామ రౌద్ర రుషితం అనే టైటిల్ తో కూడిన పోస్టర్ రిలీజ్ అయ్యింది.  అదే టైటిల్ అని అన్ని సైట్స్ రాసేశాయి. తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ను ఇంకా కన్ఫర్మ్ కాలేదని యూనిట్ చెప్తోంది.  ఇది అందరికి షాకిచ్చే న్యూస్ అనే చెప్పాలి. మరి టైటిల్ ఏంటి.. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం రాజమౌళి అండ్ కో అఫీషియల్ గా ప్రకటించే వరకు ఆగాల్సిందే.