తగ్గేది లేదంటున్న రాజమౌళి

తగ్గేది లేదంటున్న రాజమౌళి

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది.  ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు.  ఒక్క ఎన్టీఆర్ కు తప్పించి అందరికి క్యాస్టింగ్ సెట్ అయ్యింది.  రామ్ చరణ్ కు జోడిగా అలియా ఉండగా ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ కోసం రాజమౌళి సెర్చ్ చేస్తున్నారు.  

ఇండియన్ హీరోయిన్ తో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకున్నా.... రాజమౌళి మాత్రం తగ్గేది లేదని అంటున్నారు.  కథ ప్రకారమే హీరోయిన్ ఉండాలి.  అప్పుడే అనుకున్నట్టుగా సినిమా రెడీ అవుతుందని చెప్పి హాలీవుడ్ హీరోయిన్ కోసం అక్కడి క్యాస్టింగ్ ఏజన్సీస్ తో మంతనాలు జరుపుతున్నారు.  పర్ఫెక్ట్ కు మారుపేరైన రాజమౌళి ఏ విషయంలోనూ రాజీపడడు.  దట్ ఈజ్ రాజమౌళి.